Parliament: 21 నుంచి పార్లమెంటు

పార్లమెంటు(Parliament) వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సెషన్ లో జీఎస్టీ సవరణ బిల్లు– 2025, ఆదాయపు పన్ను బిల్లుతో సహా మరో ఆరు చట్టాలను ప్రవేశపెట్టి ఆమోదించనుంది. జూలై 21న ప్రారంభమై ఆగస్టు 12 న ముగుస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. మూడు నెలలకు పైగా విరామం తర్వాత లోక్ సభ, రాజ్యసభ జూలై 21న ఉదయం 11 గంటలకు సమావేశమవుతాయి(Parliament) . బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి, ఆ తేదీన ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే
మణిపూర్ జీఎస్టీ అమెండ్ మెంట్ బిల్లు
జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు
ఐఐఎం (సవరణ) బిల్లు
పన్ను చట్టాలు (సవరణ) బిల్లు
జియోహెరిటేజ్ సైట్స్,జియో-రెలిక్స్ (సంరక్షణ, నిర్వహణ) బిల్లు
గనులు, గనులు (అభివృద్ధి,నియంత్రణ) సవరణ బిల్లు
జాతీయ క్రీడా పాలన బిల్లు
జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు

Also Read :