మనిషి అదృష్టం ఎప్పుడు మెరిసిపోతుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన జస్మాయిల్(Jasmail) సింగ్ అనే కూలీకి ఓ చిన్న నిర్ణయం జీవితాన్నే మార్చేసింది. రోజూ కష్టపడి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు జస్మాయిల్. కానీ ఒక్కరోజు అతని అదృష్టం చిగురించిపోయింది.
ఓ పనిమీద ఫిరోజ్‌పుర్ అనే పట్టణానికి వెళ్లిన జస్మాయిల్ సింగ్, అక్కడ ఒక్కసారిగా ఓ లాటరీ టికెట్ కొనాలని నిశ్చయించాడు. కేవలం రూ.6 పెట్టి ఒక టికెట్ కొన్నారు. ఇది అతని జీవితాన్ని మారుస్తుందని ఆయనకు అప్పటికి ఆలోచన కూడా రాలేదు. కొన్ని గంటల తరువాత అతనికి వచ్చిన ఫోన్ కాల్ అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఆయనకు కోటి రూపాయలు బంపర్ ప్రైజ్ వచ్చిందని తెలిపారు.
ఆ సమాచారం వినగానే జస్మాయిల్ మొదట ఆశ్చర్యపోయారు. అంత పెద్ద మొత్తం తనకు వచ్చిందన్న విషయాన్ని నమ్మలేకపోయారు. కానీ అధికారిక ధృవీకరణ తర్వాత ఆనందాన్ని దిగమింగలేకపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుంటూ కనిపించారు. జస్మాయిల్ సింగ్ భావోద్వేగంతో మాట్లాడుతూ, “ఇది నాతో నిజంగా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా దేవుడి కృప,” అని పేర్కొన్నారు.
ఈ బంపర్ లాటరీ మొత్తాన్ని ఎలా వినియోగించబోతున్నారో కూడా ఆయన వివరించారు. మొదట తనకు ఉన్న సుమారు రూ.25 లక్షల అప్పును తీర్చాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మిగిలిన మొత్తాన్ని తన పిల్లల చదువు, వారి భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవాలని తెలిపారు.
అంతేకాకుండా, జస్మాయిల్(Jasmail) భార్య విర్పాల్ కౌర్ కూడా తన ఆనందాన్ని బయటపెట్టారు. “ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడేమైనా మన పిల్లలకు మంచి జీవితం ఇస్తాం,” అంటూ ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి ఇలా అకస్మాత్తుగా వచ్చిన లక్ష్మీ దయ, వాళ్ల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది. జస్మాయిల్ లాంటి సాధారణ వ్యక్తికి కోటి రూపాయల లాటరీ గెలవడం నిజంగా అద్భుతమే. ఇది మరోసారి నిరూపించింది – అదృష్టం ఎప్పుడూ తలుపు తడుతుందో ఎవరికీ ముందుగా చెప్పలేం.
Also Read :

