Ranya rao: కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు

కన్నడ నటి రన్యా రావుకు(Ranya rao) బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి 14.2కిలో గ్రాముల బంగారం (₹12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు నటి రన్యారావు పట్టుబడింది. నటి రన్యా రావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్‌‌లో భాగమైనట్లు ఆరోపణలు సైతం ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో నటి రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో తీసుకుని విచారించింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను కొట్టేసిన బెంగళూరు కోర్టు తాజాగా ఆమెకు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.(Ranya rao)
పోలీసులకు ఏం చెప్పారంటే?
దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని నటి రన్యారావు విచారణ సందర్భంగా పోలీసులకు వివరించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నట్లు వెల్లడించారు.సెక్యూరిటీ చెకింగ్ తర్వాత సుమారు 6 అడుగులు పొడవు ఉన్న వ్యక్తి రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారం ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ రెస్ట్‌రూమ్‌లో బంగారు కడ్డీలను తన శరీరానికి అతికించుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరికొంత బంగారాన్ని జీన్స్‌, షూస్‌లో దాచుకున్నట్లు వివరించారు. యూట్యూబ్ వీడియోల ద్వారా బంగారాన్ని ఎక్కడ దాచుకోవాలో…ఎలా స్మగ్గింగ్ చేయాలో నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read :