మైనంపల్లి నయా నయీం.. కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం ముదిరిందా?
హైదరాబాద్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు,(Hanumanth Rao) ఆయన కుమారుడిపై బీఆర్ఎస్ బీసీ ప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేశారు. “హైదరాబాద్లో మరో నయీంలా మైనంపల్లి వ్యవహరిస్తున్నాడు”, అంటూ మండిపడ్డారు.
అల్వాల్ బోనాల ఘటనపై స్పందన
అల్వాల్లో జరిగిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన కార్యకర్తలను శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, పద్మారావు గౌడ్, గంగుల కమలాకర్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు.(Hanumanth Rao)
ఘాటు వ్యాఖ్యలు – బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
వారు మాట్లాడుతూ:
“మైనంపల్లి, అతని కుమారుడు మల్కాజిగిరిలో గుండా రాజకీయం చేస్తున్నారు.”
“పేద, మధ్యతరగతి ప్రజలపై రౌడీయిజం చలాయిస్తున్నారు.”
“పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. డీజీపీ ఏమి చేస్తున్నారు?”
“ఇది ప్రజా పాలనా..? రౌడీల పాలనా..?”
హెచ్చరికల స్వరం
“బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రౌడీయిజానికి తగిన బుద్ధి చెబుతుంది. బీసీలు తిరగబడితే సహించరు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.” అని వారన్నారు.
అలాగే, “ఇలాంటి చర్యలతో తెలంగాణకు చెడ్డ పేరు వస్తుంది. పెట్టుబడులు రావు.” అని హెచ్చరించారు.
Also Read :
- Balmuri Venkat Ghatu: కేటీఆర్.. మతి తప్పి మాట్లాడుతున్నవ్
- Mahesh Kumar Goud: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికే ఉండదు

