హైదరాబాద్: జీవో 3 ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనియ్యకుండ స్ట్రీట్ ఫైట్, లీగల్ ఫైట్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రోస్టర్ పాయింట్లో ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలో ఆమె మాట్లాడారు.1996లో పీవీ నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్లు అందించారన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలని సూచించారు. 2022లో సుప్రీంకోర్టు జీవో3ను రద్దు చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చారని రేవంత్ పై మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులలో డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి అని చెప్పారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలని రేవంత్ కేసులు కొట్లాడుతున్నాడని, తన ఓటుకు నోటు కేసు పై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల సమస్యలపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. జీవో 3ని రద్దుచేసి 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలు సీఎంను కలవాలని పోతే అపాయింట్మెంట్ కూడా కరువైందన్నారు. 90 రోజుల్లో ఒక్కనాడైనా ప్రజలను సీఎం కలవలేదని, ప్రజాపాలన అని మాటలకే పరిమితం చేసాడని ఆరోపించారు. రెండు రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లి సోనియా దగ్గర హాజరు వేసుకోలని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఒక పర్సెంట్ ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీపై ప్రశ్నిస్తానని ఆమె వెల్లడించారు. (MLC Kavitha)
జీవో 3 ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనియ్యకుండ స్ట్రీట్ ఫైట్, లీగల్ ఫైట్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రోస్టర్ పాయింట్లో ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలో ఆమె మాట్లాడారు.1996లో పీవీ నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్లు అందించారన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలని సూచించారు. 2022లో సుప్రీంకోర్టు జీవో3ను రద్దు చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చారని రేవంత్ పై మండిపడ్డారు.
Also read:
- SHIVARATRI: జాగారం చేస్తున్నారా? ఒక్క నిమిషం!!
- Minister Prabhakar: మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి అవార్డ్స్

