ముంబై పేలుళ్ల కేసు – 12 మంది నిర్దోషులుగా హైకోర్టు తీర్పు!
2006లో ముంబై(Mumbai) నగరాన్ని ఉలిక్కిపడేసిన సబ్ర్బన్ రైలు బాంబు పేలుళ్ల కేసులో తాజా మలుపు చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇస్తూ, ట్రయల్ కోర్టు ద్వారా శిక్ష పడిన 12 మంది అనుమానితులందరిని నిర్దోషులుగా ప్రకటించింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు:
-
ప్రాసిక్యూషన్ పూర్తి విఫలమైందని హైకోర్టు స్పష్టం చేసింది.
-
12 మందిపై ఉన్న అభియోగాలను సమర్థవంతంగా న్యాయపరంగా నిఖార్సైన రీతిలో రుజువు చేయలేకపోయిందని పేర్కొంది.(Mumbai)
-
ట్రయల్ కోర్టు అప్పట్లో ఐదుగురికి మరణ శిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించడంతో, అప్పీలు దాఖలయ్యింది.
2006 పేలుళ్ల దుర్ఘటన:
-
తేదీ: జూలై 11, 2006
-
ప్రాంతం: ముంబై వెస్టర్న్ రైల్వే
-
బాంబులు: 7 చోట్ల ఒకేసారి, ఫస్ట్-క్లాస్ కంపార్ట్మెంట్ల్లో
-
మృతులు: 189 మంది
-
గాయాలు: 800 మందికి పైగా
-
బాంబులు ప్రెషర్ కుక్కర్లలో అమర్చినవి
Also Read :

