ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానిక సత్తా చాటామని, మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ పార్లమెంటు(Parliament) సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ తో వంద శాతం లక్ష్యాలను సాధించామని అన్నారు. కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఈ ఆపరేషన్‌తో మేడిన్ ఇండియా సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందని అన్నారు. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని కలిసినా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారన్నారు. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని, దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిదని చెప్పారు. (Parliament) ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించారని ప్రధాని గుర్తుచేశారు. పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారని అన్నారు. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం బలంగా నిలబడిందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వేడుక చేసుకోవాలని అన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఐక్యత చాలా అవసరమని చెప్పారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశానికి చాలా గర్వకారణంగా నిలవబోతున్నాయని ప్రధాని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వనన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణగా అభివర్ణించారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
Also Read :

