రాష్ర్టం ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపో లు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో మహా లక్ష్మి పథకం ద్వారా 9 డిసెంబర్ 2023 న ప్రారంభించిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా రాష్ర్ట ప్రభుత్వం వారి టికెట్ ధరకు సమానంగా రూ. 6700 కోట్లను చెల్లించిందన్నారు.(RTC) ఈ పథకం అమలులో ఇబ్బందులు రాకుండా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. మహా లక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్లు , సిబ్బందికి, అధికారులను మంత్రి అభినందించారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూరపు ప్రాంత మహిళలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి మహిళ నెలకు రూ.4 నుంచి 5 వేల వరకు ఆదా చేసుకుంటుందన్నారు..
Also Read :

