Sindoor: ఆపరేషన్ సిందూర్ పై చర్చకు డేట్ ఫిక్స్

ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. మూడు రోజులుగా విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలూ అట్టుడికాయి. వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ఆపరేషన్ సిందూర్(Sindoor) పై చర్చించేందుకు మోదీ అంగీకరించారు. ఈ మేరకు బీఏసీలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న లోక్ సభలో, 29న రాజ్య సభలో యావత్ దేశాన్ని కుదిపేసిన ఆపరేషన్ సిందూర్ పై చర్చించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నారు. ఇవాళ జరిగిన పార్లమెంట్‌ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. పాకిస్తాన్‌, పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంలో కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్‌ కూడా భారత్‌ పైకి డ్రోన్లు, క్షిపణలు పంపించింది. దీంతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజుల పాటు భీకర ఘర్షణ వాతావరణం నెలకొంది.(Sindoor)
అనంతరం పాక్‌ అభ్యర్థన మేరకు భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ముగించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికీ 25 సార్లు ప్రకటించుకున్నారు. దీంతో అగ్రరాజ్య ఆరోపణలపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరపాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై చర్చకు తాజాగా తేదీని నిర్ణయించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. మాల్దీవులు, యూకే పర్యటన ముగించుకొని జులై 26న స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఆయన కూడా చర్చలో పాల్గొంటారు.

Also Read :