Anganwadi: కొత్తగా 1,000 అంగన్వాడీ భవనాలు

1,000 కొత్త అంగన్వాడీ భవనాలకు శ్రీకారం – నవంబర్ 19 నాటికి పూర్తయ్యేలా అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం.

తెలంగాణలో అంగన్వాడీ(Anganwadi) సేవలను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. నవంబర్ 19 (ఇందిరా గాంధీ జయంతి) నాటికి 1,000 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించాలంటూ అధికారులను ఆదేశించారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ సేవల పునరుద్ధరణ, పోషకాహార లోప నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా అధికారులు అంగన్వాడీ(Anganwadi) కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి, హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో భవనాల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పిల్లల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

అనంతరం టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 23 మంది సీడీపీఓలకు నియామక పత్రాలు అందజేశారు. “రాజకీయ ఒత్తిడులకు లొంగవద్దు, స్వేచ్ఛగా సేవ చేయండి. లబ్ధిదారుల్లో పోషకాహార లోపం తగ్గించాల్సిన బాధ్యత మీది,” అని హితవు పలికారు.

Also Read :