War –2: వార్ –2 ట్రైలర్ రిలీజ్

వార్ – 2 ట్రైలర్ రిలీజ్: ఎన్టీఆర్ – హృతిక్ అగ్ని పరీక్ష మొదలైంది!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్–2(War –2) ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందింది. ట్రైలర్‌లో ఓవర్-ద-టాప్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, ఎన్టీఆర్ – హృతిక్ మధ్య తలపడే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి.(War –2)

ఈ ట్రైలర్‌ను హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరి 25 ఏళ్ల సినీ జర్నీకి గుర్తుగా విడుదల చేశారు. “వార్” మొదటి భాగానికి సరిపోయేలా కాకుండా… దానికంటే మించి మేకింగ్, స్కేల్, యాక్షన్ పరంగా మాంచి స్థాయిలో తీసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాకు రజినీకాంత్ “కూలీ” మూవీ నుంచి కాస్త పోటీ ఉన్నా… ఎన్టీఆర్‌కు సౌత్‌లో ఉన్న పాపులారిటీ & ఫ్యాన్ బేస్‌తో వార్–2 బాక్సాఫీస్‌ వద్ద బలంగా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు.

Also Read: