రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా – మంత్రుల దిల్లీ పర్యటన కారణం.
రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం జరగాల్సిన కేబినెట్ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)అధ్యక్షతన ఏర్పాట్లు జరిగాయి. కానీ, ఐదుగురు కీలక మంత్రులు అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని సీఎం సూచించారు.
- ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓబీసీ సమావేశానికి
- పొన్నం ప్రభాకర్,
- కొండా సురేఖ,
- వాటికి శ్రీహరి హాజరయ్యారు.
- అదే విధంగా,
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిల్లీలో పర్యటిస్తున్నారు.
దీంతో, ఐదుగురు మంత్రుల గైర్హాజరుతో అధికారిక సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.(Revanth reddy)
Also Read :

