ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురు దెబ్బ
ఓబుళాపురం(Obulapuram) మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి వై శ్రీలక్ష్మికు హైకోర్టులో చుక్కెదురైంది.
ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ను హైకోర్టు నేడు కొట్టివేసింది. (Obulapuram)
- 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో,
- ఓబుళాపురం మైనింగ్ లీజుల కట్టబెట్టేందుకు అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
- 2022లో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి చేస్తూ తీర్పు ఇచ్చింది.
- అయితే, ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి, తీర్పు పునర్విమర్శ చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారించిన హైకోర్టు, శ్రీలక్ష్మిని ఈ కేసులో నిందితురాలిగా తేల్చింది.
దీంతో ఆమెకు మరోసారి సీబీఐ కోర్టులో ట్రయల్ ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.
Also Read:

