Tamannah :ఓదెల-2లో మిల్కీ బ్యూటీ తమన్నా

tamannah in odela-2

రైల్వే స్టేషన్.. రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఓదెల-2లో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah )లీడ్ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గానే వారణాసిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా మరో లీడ్ రోల్ పోషిస్తోంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమన్నా (Tamannah )ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ.. ఓం నమ: శివాయ అంటూ తమన్నా (Tamannah )స్పెషల్‌ లుక్ ను షేర్ చేశారు. పోస్టర్ ఒక చేతిలో పవిత్ర కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా తమన్నా దర్శనమిస్తోంది. కాశీ ఘాట్ లపై నడుస్తూ.. దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్‌, స్టైలిష్ రోల్స్‌లో నటించిన తమన్నా(Tamannah ).. ఓదెల 2 లో శివశక్తిగా మారిపోయింది. ప్రస్తుతం తమన్నా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం సౌత్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా  (Tamannah ). ఆమె చేతిలో కొన్ని వెబ్ సిరీస్ తోపాటు రెండు మూడూ సీక్వెల్స్ కూడా ఉన్నాయి.

tamannah in odela railway station

 

Also Read:

MAHASHIVARATRI: ఉపవాసం ఎలా విరమించాలి

MLC Kavitha: నిద్రపోనివ్వ