Spermtech: ఇండియన్​ స్పెర్మ్​టెక్​లో పోలీసుల తనిఖీలు

ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో సంచలన దాడులు – రోజూవారీ కూలీలు, యాచకుల నుంచి వీర్యకణాల సేకరణ ఆరోపణలు

సికింద్రాబాద్ గోపాలపురం ప్రాంతంలోని ఇండియన్ స్పెర్మ్ టెక్ (Spermtech)కేంద్రంలో ఇవాళ పోలీసులు తీవ్ర తనిఖీలు నిర్వహించారు.
సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాల నేపథ్యంలో, ఇదే తరహా సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ దాడులు జరిపింది.

క్లూస్ టీమ్ సహకారంతో

  • వీర్యకణాలకు సంబంధించిన మూడు డబ్బాలు
  • కొందరి ఆధార్ కార్డులు
    స్వాధీనం చేసుకున్నారు.

నిర్వాహకుడు పంకజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.(Spermtech)

రోజువారీ కూలీలు, యాచకులు, పాదచారులకు కమీషన్ ఇచ్చి వీర్యకణాలు, అండాలను సేకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో ఏడు మందిని టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
ఇది ఆరోగ్య నిబంధనలకు, జాతీయ అవయవ దానం చట్టాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తరహా అక్రమ కేంద్రాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముండటంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

 

Also read :