Hanuman Beniwal: అప్పగింతలే మిగిలాయ్

‘‘అప్పగింతలే మిగిలాయ్’’ – ఆపరేషన్ సిందూర్‌పై ఎంపీ హనుమాన్ బేనీవాల్(Hanuman Beniwal) వ్యంగ్య వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ చీఫ్‌, ఎంపీ హనుమాన్ బేనీవాల్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

ఆయన మాట్లాడుతూ…

ఆపరేషన్‌కి ‘సిందూర్’ అనే పేరు పెట్టారు. అది పాకిస్తాన్‌కు పెళ్లిచూపుల్లా కనిపిస్తుంది. ఇప్పుడు కేవలం అప్పగింతలే మిగిలాయి!
మీరు వెళ్లి పాకిస్తాన్‌ను తీసుకురండి!” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సభలో ఉన్న సభ్యులు ఒక్కసారిగా నవ్వులు పూయించారు.(Hanuman Beniwal)

అయితే, అదే సమయంలో సభ గంట మోగడంతో ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సిందూర్‌లో భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా, దీనిపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది.

ఇందులో పలువురు ప్రతిపక్ష నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Also Read :