ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక సూచన చేసింది. మూడు నెలల్లోగా స్పీకర్ తేల్చాలని సూచించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దానం నాగేందర్(ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), గూడెం మహీపాల్ రెడ్డి(భద్రాచలం), అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), సంజయ్ (జగిత్యాల), కాలె యాదయ్య( చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్) కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ల పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనాసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించోద్దని పేర్కొంది. (Supreme Court) విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలా చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఆలస్యాన్ని నివారించేందుకే మూడు నెలల కాల పరిమితి పెడుతున్నట్టు తెలిపింది. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అనర్హతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదనే ఫన్నీ కామెంట్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టాన్ని తీసుకురావాలని సూచించింది.ఈ వ్యవహరంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసుల ఇచ్చారని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కామెంట్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం కాదన్నారు.
Also Read:

