650 పేజీల ‘కాళేశ్వరం(Kaleshwaram) కమిషన్’ నివేదిక అందిన కేంద్రం – బాధ్యులెవరు అన్నది ఆసక్తికరంగా మారిన అంశం!
తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ తుది నివేదికను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దేశ తొలి లోక్‌పాల్ జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్, మొత్తం మూడు వాల్యూమ్లుగా కూడిన 650 పేజీల నివేదికను నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆయన ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగించారు.
నివేదికలో ఏముందన్నదే ఉత్కంఠ!
2023 నవంబర్‌లో మెదగడ్డ బ్యారేజీ కుంగడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో సీపేజ్ లాంటి తీవ్రమైన ఇంజినీరింగ్ లోపాలపై విచారణ కోసం 2024 మార్చిలో ఈ కమిషన్ ఏర్పడింది. 119 మందిని, వీరిలో మాజీ సీఎమ్ కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తో పాటు వివిధ స్థాయిల ఇంజినీర్లను విచారించింది. కేవలం వారి స్టేట్‌మెంట్లు మాత్రమే కాకుండా అఫిడవిట్లు కూడా స్వీకరించి తీర్పులో కీలకంగా పేర్కొనింది.(Kaleshwaram)
కమిషన్ విచారించిన కీలక అంశాలు:
-
బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్ లోపాలు, కన్స్ట్రక్షన్ లోని నాణ్యతా లోపాలు
-
క్వాలిటీ కంట్రోల్, ఓ అండ్ ఎం, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీల పాత్ర
-
ఇంజినీర్లు నుంచి ఈఎన్సీ వరకు అన్నివర్గాలను ప్రశ్నించి ఆధారాలు సేకరణ
-
బాధ్యులుగా ఎవరిని గుర్తించారన్నది కీలకమైన అంశంగా మారింది
రాజకీయంగా హాట్ టాపిక్
ప్రాజెక్ట్‌కు వందల కోట్ల వ్యయం జరిగిన నేపథ్యంలో, ఇంజినీరింగ్ లోపాలతో బ్యారేజీలు కుంగిపోవడమే కాకుండా పలు సాంకేతిక అంశాలపై నిష్కర్షలు ఎలా వచ్చాయన్నది ఆసక్తి రేపుతోంది. బాధ్యత వహించాల్సిందెవరు?, నిబంధనలు లేవు చేశారెవరు?, అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read :
- Malegaon blast: మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురూ నిర్దోషులే!
- Supreme Court: మూడు నెలల్లోగా తేల్చండి

