తిరుమల శ్రీవారి లడ్డూకు(Srivari laddu) నేటితో 310 ఏళ్లు పూర్తయ్యాయి. మొదట 15వ శతాబ్దంలో భక్తులకి వడ ప్రసాదం మాత్రమే అందించేవారు అర్చకులు. 17వ శతాబ్దం నుంచి బూందీ రూపంలో లడ్డూని శ్రీవారికి సమర్పించారు. ఆ తర్వాత 1803లో అప్పటి మద్రాస్ సర్కార్ మెుదటిసారి ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది(Srivari laddu). ఇలా ఎన్నో ఏళ్లుగా ఎంతో మార్పులు చేస్తూ.. భక్తులకు మరింత నాణ్యతతో రుచి, శుచి, శుభ్రతతో తయారు చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రసాదంగా చరిత్రకెక్కింది. క్రమేపీ తిరుమల లడ్డూకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. జియాగ్రాపికల్ ఐడెంటిఫికేషన్ ఉండడంతో తిరుమల లడ్డూను ఎక్కడ తయారు చేసేందుకు అవకాశం లేకుండా చేసింది టీటీడీ.. ప్రస్తుతం సగటున రోజుకి 3 లక్షల లడ్డూలు తయారు చేస్తోంది. శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకతను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. డూప్లికేట్ తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయించేందుకు ఎన్నో సంస్థలు ప్రయత్నించాయి. కానీ తిరుమల లడ్డూతో సరిసమానంగా నిలవలేకపోయాయి. ఇక ఆన్లైన్ లో లడ్డూలను విక్రయించే సంస్థలన్నింటికీ టీటీడీ నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేసింది.
Also Read :
- Revanth reddy: ఆవారాగా తిరిగేటోళ్లు.. తిట్లొచ్చినోళ్లు జర్నలిస్టులా?
- Meenakshi: చరఖా పట్టిన మీనాక్షి

