తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy) రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న అపోహలను ఖండిస్తూ, పెట్టుబడులు మాత్రమే అభివృద్ధికి మార్గమని స్పష్టం చేశారు. (RevanthReddy) హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ, పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
రియల్ ఎస్టేట్, పెట్టుబడులు, అభివృద్ధి
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు పెట్టుబడులు పెట్టేందుకు తాను భరోసా ఇస్తానని సీఎం తెలిపారు. నిజాం నవాబుల కాలం నుంచి ఇప్పటి వరకు అనుసరించిన ప్రభుత్వ పాలసీలు హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, కష్టనష్టాలు బాగా తెలుసని అన్నారు.
ఇంగ్లీష్ అవసరం లేదు – తెలివితేటలు ముఖ్యం
“తనకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ పాలనలో తెలివితేటలు ముఖ్యం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శక పాలసీలు తీసుకువస్తున్నామని, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఫ్యూచర్ సిటీ, మౌలిక సదుపాయాలు
తాను ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి మాట్లాడితే, కొందరు ఎద్దేవా చేస్తున్నారని, అయినా కాలుష్య రహిత భవిష్యత్ నగరాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఢిల్లీలో కూర్చొని డిఫెన్స్ భూములకు అనుమతి తెచ్చానని, మూసీ పునరుద్ధరణ, మెట్రో లైన్ విస్తరణ, డిఫెన్స్ భూముల విషయంలో కూడా చురుకైన చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు.
కాళేశ్వరం, వడ్డీ తగ్గింపు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ₹29,000 కోట్లు వడ్డీ చెల్లించామని, పాత అప్పులపై వడ్డీని 11.5% నుంచి 7.5%కి తగ్గించే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆదిలాబాద్, వరంగల్‌లకు రెండు విమానాశ్రయాలకు అనుమతులు తీసుకొచ్చానని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ అనుభవం
రియల్ ఎస్టేట్ సెంటిమెంట్‌ని బాగా అర్థం చేసుకున్నానని, తానూ ఈ రంగంలో పనిచేశానని సీఎం చెప్పారు. “కోకాపేటలో ఒకప్పుడు ఎకరం ₹8 లక్షలకు కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు ₹100 కోట్లు విలువైంది” అని ఉదాహరణ ఇచ్చారు.
Also read:

