NagarjunaSagar: సాగర్ కు పోటెత్తిన పర్యాటకులు

NagarjunaSagar

నాగార్జునసాగర్ (NagarjunaSagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీటి ఇన్ఫ్లో రావడంతో డ్యాం (NagarjunaSagar)16 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తు వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

వరుస సెలవులు రావడంతో పర్యాటకుల రద్దీ మరింత పెరిగింది. కృష్ణమ్మ ఒడిలో అలల విందు చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు కార్లు, ప్రైవేటు వాహనాల్లో సాగర్ చేరుతున్నారు. దీంతో డ్యాం సమీపంలోని శివాలయం ఘాట్, కొత్త బ్రిడ్జి వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 

ప్రయాణికులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వరద నీటితో నిండిన సాగర్, గేట్ల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీ ఇన్ఫ్లో రావడంతో డ్యాం 16 క్రస్ట్ గేట్లు 5 అడుగుల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు కార్లు, ప్రైవేటు వాహనాల్లో వస్తుండటంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. డ్యాం సమీపంలోని శివాలయం ఘాట్, కొత్త బ్రిడ్జి వైపు సుమారు రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Also read: