Bandi: బీజేపీ అంటే భయమెందుకు?

Bandi

కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎందుకు భయమని కేంద్ర మంత్రి బండి (Bandi) సంజయ్ ప్రశ్నించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చర్యను సంజయ్ తీవ్రంగా (Bandi) ఖండించారు.

కాంగ్రెస్‌పై విమర్శలు

అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ అక్రమ అరెస్టులు చేసి వైఫల్యాలను దాచుకుంటోందని అన్నారు.

Image

ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాంచందర్ రావుతో పాటు కార్యకర్తలు, కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హెచ్చరిక

అలా జరగకపోతే రేవంత్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.

Also read: