Telangana: రోడ్లు, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం

Telangana

(Telangana) తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తుండగా, పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో పంటలు నీటమునిగిపోవడం, రహదారులు, రైల్వే మార్గాలు దెబ్బతినడం వల్ల (Telangana) రవాణా పూర్తిగా స్తంభించింది.

జంగంపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు పొంగిపొర్లడంతో కామారెడ్డి–హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లా బిక్కనూర్–తలమట్ల వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. వరద ప్రవాహంతో ట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ట్రాక్‌ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. భికనూర్–తల్మడ్ల సెక్షన్, అకాన్‌పేట్–మెదక్ సెక్షన్‌లోని ట్రాక్‌లపై నీరు పొంగిపొర్లుతున్నందున రైళ్ల రాకపోకలను నిలిపివేయడం లేదా మళ్లించడం జరిగింది.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరదలతో రోడ్లు దెబ్బతినడంతో రహదారి మార్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు, రైళ్ల రద్దు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం, ఇంకా రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టం కానుందని అధికారులు తెలిపారు. 🌧️

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా బిక్కనూరు-తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది. వరద నీరు ప్రవాహంతో ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్‌ల వద్ద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సికింద్రాబాద్‌–నిజామాబాద్‌ రైల్వే మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు… పలు రైళ్లను రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించడం చేపట్టారు. భికనూర్ – తల్మడ్ల సెక్షన్, అకాన్‌పేట్ – మెదక్ సెక్షన్‌లోని ట్రాక్‌లపై నీరు పొంగిపొర్లుతున్నందున పలు రైళ్లను దారి మళ్లించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే మళ్లించడం జరిగింది.

Also read: