Hyderbad: హైదరాబాద్ లో బీచ్!

Hyderabad

ముత్యాల నగరం హైదరాబాద్‌ (Hyderbad) పర్యాటకులకు ఎన్నో అద్భుత కట్టడాలు, సంస్కృతిని చూపుతుంది. అయితే ఇప్పటివరకు బీచ్ అందాలను ఆస్వాదించే అవకాశం లేదు. (Hyderbad) కారణం – సముద్రం లేని నగరం కావడం. ఇప్పటి వరకు బీచ్ అనుభవం కావాలంటే బాపట్ల జిల్లాలోని సూర్యలంక వెళ్లాల్సి వచ్చేది.

Image

ఇకపై హైదరాబాద్‌లోనే బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. కోత్వాల్గూడ సమీపంలో భారీ ఆర్టిఫిషియల్ బీచ్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి.

ఈ ప్రాజెక్ట్‌ 35 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది. ఇందులో బీచ్‌ వాతావరణంతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం దీన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మారుస్తుందని భావిస్తోంది. పీపీపీ మోడల్ కింద రూ.225 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం జరగనుంది. ఈ డిసెంబర్‌లో పనులు ప్రారంభం కానున్నాయి.

సాహస క్రీడలు – వినోదం
నిజమైన బీచ్‌ అనుభూతిని కలిగించే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దనున్నారు. స్టార్‌ హోటళ్లు, విలాసవంతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి.

ఫ్యామిలీ ఎంజాయ్‌ కోసం పార్కులు, ఆటస్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టులు, థియేటర్లు, వేవ్‌పూల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అలంకార ఫౌంటెన్లు ఈ ప్రాంత అందాలను మరింత పెంచుతాయి.

కనెక్టివిటీ పరంగా కూడా ప్రాజెక్ట్‌కి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం వల్ల నగరంలోని ఏ ప్రదేశం నుంచైనా సులభంగా చేరుకోవచ్చు.

Also read:

CM: కాళేశ్వరం రిపేరుకు 80 వేల పుస్తకాలు చదవాలె!

Telangana politics: ఆ ఇద్దరినీ వరద కలిపింది