భారీ వర్షాలు కామారెడ్డి,(Bhodhan-Medak) మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. రెండు జిల్లాల ప్రజలు వర్షానికి తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం, వరద కారణంగా (Bhodhan-Medak) బోధన్–మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారి 765 డీ తీవ్ర నష్టానికి గురైంది. రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు, ప్రయాణికులు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. పలువురు ఘనపూర్ నుంచి ఆర్గోండ మీదుగా కామారెడ్డికి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ చిన్నమల్లారెడ్డి సమీపంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి.
ఇక, రహదారి బంద్ కావడంతో తిరిగి రామాయంపేట మీదుగా వెళ్లేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు చేపడుతున్నారు. స్థానిక ప్రజలు, వాహనదారులు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావం తగ్గకపోతే రహదారి మరమ్మతులు ప్రారంభించడం కష్టమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సంఘటన వల్ల రెండు జిల్లాల మధ్య రవాణా పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిస్థితిని అంచనా వేసి అత్యవసర పనులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
Also read:

