Telangana: రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా

Telangana

రైతుల కోసం శుభవార్త. యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. రాష్ట్ర (Telangana) ప్రభుత్వం చేసిన ఒత్తిడితో కేంద్రం స్పందించింది. వచ్చే వారంలోగా 50 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Image

వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ –

  • వచ్చే రెండు రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్‌నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని చెప్పారు.

  • సెప్టెంబర్ మొదటి వారంలో గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది.

  • ఆ యూరియాను ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్‌నగర్, గజ్వేల్ ప్రాంతాలకు తరలిస్తారు.

  • అక్కడి నుంచి డిమాండ్ ఆధారంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

అలాగే పంట నష్టంపై అధికారులు వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బృందాలుగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించాలన్నారు.

Also read: