MLC Kavitha: రైతులు, పేదలపై పగ చూపుతున్నారా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ (MLC Kavitha) ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, పేదలపై ఎందుకింత పగ చూపుతున్నారని ప్రశ్నించారు.

కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం భూసేకరణలో ప్రభుత్వం దుర్మార్గానికి దిగిందని (MLC Kavitha) ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.

Image

‘మొన్న లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలనే, ఇప్పుడు కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.

Image

కవిత స్పష్టం చేశారు: ప్రజలపై అన్యాయం చేస్తే ఊరుకోబోమని. కానుకుర్తి ప్రజలకు ఇదివరకే అండగా నిలిచామని, ఇకముందు కూడా వారి పక్షాన పోరాటంలో ముందుంటామని ట్వీట్ చేశారు.

Also read: