రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా 580 అంగన్వాడీ కేంద్రాలు దెబ్బతిన్నాయి. వీటిలో 440 సొంత భవనాలు, 140 రెంట్ ఫ్రీ భవనాలు (Seethakka) ఉన్నాయి. పైకప్పుల లీకేజీలు, గోడల పగుళ్లు, బేస్‌మెంట్ సమస్యలు (Seethakka) ఎక్కువగా గుర్తించారు. మరమ్మతులకు సొంత భవనాలకు రూ.14 కోట్లు, రెంట్ ఫ్రీ భవనాలకు రూ.3 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, గద్వాల్, హనుమకొండ, మెదక్, వనపర్తి, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది.
కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు చేరడంతో బియ్యం, పప్పులు, నూనె, పాలు, స్టడీ మెటీరియల్ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క తడిసిన భవనాల్లో సేవలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. కేంద్రాలను తాత్కాలికంగా ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో తరలించాలని సూచించారు.
Also read:

