కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. (Kaleshwaram) కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేజర్ పాత్ర హరీష్ రావుదేనని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ పరిస్థితులకు మేఘా కృష్ణారెడ్డి, హరీష్ రావు, సంతోష్ కారణమని తెలిపారు.
కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ ప్రజల సమస్యలపైనే దృష్టి పెడతారని అన్నారు. “కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పేరు ఇంకా 200 సంవత్సరాలు చెప్పుకుంటారు” అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల అజెండాలను అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
🔹 “పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత?”
తనది కేసీఆర్ బ్లడ్ అని స్పష్టంగా చెప్పిన కవిత, కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ జరుగుతున్న పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. “పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? కేసీఆర్ పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది” అని వ్యాఖ్యానించారు. తాను స్వతంత్రంగా కొనసాగుతానని, తాను డైరెక్టుగా చెప్పిన వారిపై ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.
🔹 బీహార్ ఎన్నికలపై విమర్శలు
ఎంఎల్సీ కవిత మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణను ప్రచార ఆయుధంగా కాంగ్రెస్ వాడుకుందని, దీనికి వ్యతిరేకంగా తాము జాగృతి ఆధ్వర్యంలో బీహార్‌లో ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీలను మభ్యపెడుతోందని, దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు బలంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ఎంఎల్సీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యతను తెరపైకి తెచ్చాయి. ఒకవైపు కేసీఆర్ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Also read:
- Bathukamma: గిన్నిస్ బుక్ లో రికార్డు లక్ష్యంగా
- MahindraUniversity: మట్టి గాజుల్లో డ్రగ్స్స్మగ్లింగ్

