తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావు లను (Kavitha) “అవినీతి అనకొండలు” అని సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కవిత మాట్లాడుతూ, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అడ్డగోలు ప్రచారాల వెనుక హరీశ్, సంతోష్ లే ఉన్నారని ఆరోపించారు. వీరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఉందని, వీరికి ప్రత్యేక బ్యాచ్‌లు ఉన్నాయని అన్నారు. తాను ఎప్పుడూ భయపడనని, నేరుగా సవాల్ విసురుతున్నానని కవిత ప్రకటించారు.
🔹 కేసీఆర్ పై సీబీఐ విచారణపై స్పందన
కవిత మాట్లాడుతూ, “నా తండ్రి కేసీఆర్ దేవుడి లాంటి వారు. ఆయన తెలంగాణ కోసం అన్నీ త్యాగం చేశారు. తిండిమీద కూడా ఆయనకు ఆసక్తి ఉండదు. అలాంటి నాయకుడిపై సీబీఐ విచారణ జరగడం నా గుండె మండిస్తోంది” అని అన్నారు.
కేసీఆర్ పేరును కలంకపరిచేలా సీబీఐ విచారణ జరగడం అన్యాయమని ఆమె అన్నారు. “ఇకపై కేసీఆర్ అంటే సీబీఐ కేసా అని అంటారా? నా తండ్రి పరువు పోతే మా కుటుంబ ఇజ్జత్ కూడా పోతుంది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? కానీ పరువు ముఖ్యమని” కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
🔹 కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైంపాస్ చేస్తోందని కవిత ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ వేయగానే వెంటనే సీబీఐ విచారణకు అప్పగించడం అన్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కోరితే తెలంగాణ బంద్‌కు పిలుపు ఎందుకు ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు.
🔹 హరీశ్ రావు, సంతోష్ పై ఆరోపణలు
కవిత మాట్లాడుతూ, హరీశ్ రావు, సంతోష్ రావు వలననే కేసీఆర్ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. “నా తండ్రి పేరును అడ్డుపెట్టుకుని వాళ్లు సొంత ఆస్తులు, వనరులు పెంచుకున్నారు. అయినా కూడా కేసీఆర్ వారిని భరిస్తున్నారు” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంఎల్సీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం రేపాయి. హరీశ్ రావు, సంతోష్‌లపై ఆమె చేసిన “అవినీతి అనకొండలు” వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు రాబోయే రోజుల్లో మరింత చర్చకు దారితీయడం ఖాయం.
Also read:
- Kaleshwaram: హరీష్ రావు మేజర్ పాత్ర – ఎమ్మెల్సీ కవిత సంచలన
- Bathukamma: గిన్నిస్ బుక్ లో రికార్డు లక్ష్యంగా

