ఉప రాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ –
“రేసులో ఉన్న ఇద్దరూ మంచి వ్యక్తులే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిది కాదు. నోటా ఉంటే తప్పకుండా ఓటేస్తేవాళ్లం” అని అన్నారు.(KTR)
కేటీఆర్ చెప్పారు –
“రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దాన్ని తీర్చిన వారికి మద్దతిస్తామని నేను ముందే అన్నాను. కానీ, కేంద్రం – రాష్ట్రం రెండూ విఫలమయ్యాయి. అందుకే మేము ఓటింగ్‌కు దూరంగా ఉన్నాం” అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
“ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ విషం చిమ్ముతోంది. కోట్లు ఖర్చు పెట్టి పీసీ ఘోష్ కమిషన్ వేసినా ఏమీ తేలలేదు. ఇప్పుడు మళ్లీ సీబీఐ ఎంక్వయిరీ అంటున్నారు. సీబీఐ అనేది బీజేపీ జేబు సంస్థ” అని కేటీఆర్ దుయ్యబట్టారు.
అదే సమయంలో ఆయన అన్నారు –
“ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూ, మరో వైపు మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తామంటున్నారు. నిజానికి మల్లన్నసాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మూసీకి తెస్తున్నది కాళేశ్వరం నీళ్లే కాదా?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ డిమాండ్ చేస్తూ –
“కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఈ ప్రాజెక్టుతో 240 టీఎంసీల వినియోగం జరిగింది. 2023 మే 17న కేసీఆర్ మూసీకి గోదావరి నీళ్లు తీసుకురావాలని నిర్ణయించారు. కొండపోచమ్మసాగర్ నుంచి కేవలం ₹1100 కోట్లతో తీసుకురావచ్చు. కానీ ప్రభుత్వం వ్యయాన్ని ఏడు రెట్లు పెంచింది. ఇప్పుడు ₹7400 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలి” అని అన్నారు.
Also read:
- RamChanderRao: మీకు చేతకాకుంటే 42% రిజర్వేషన్లు మేమిస్తం
- Ponnam: కేంద్రం యూరియా ఇస్తలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

