హాలీవుడ్ గ్లామర్ స్టార్ సిడ్నీ స్వీనీ (SydneySweeney) పేరును ఈ మధ్య ఎక్కడ చూసినా వినిపిస్తోంది. యూఫోరియా, ఎనీవన్ బట్ యూ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనదైన ముద్ర వేసుకున్న (SydneySweeney) బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. ఒక బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్, సిడ్నీ స్వీనీని ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటింపజేయాలని ప్రయత్నిస్తోందట. అందుకోసం ఆమెకు రెమ్యూనరేషన్‌గా ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్?
ఈ డీల్ నిజమైతే సిడ్నీ స్వీనీ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ఇంత భారీ మొత్తాన్ని ఓ హీరోయిన్‌కు ఆఫర్ చేసిన దాఖలాలు చాలా అరుదు.
ముంబై సినీ వర్గాల్లో హల్‌చల్
ఈ వార్తపై ముంబై సినీ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన రాలేదు.
ఫ్యాన్స్ ఆసక్తి
సిడ్నీ స్వీనీ ఇండియన్ సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహాగానాలతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వార్త నిజమా కాదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
Also read: