అమ్మాయిగారు సీరియల్ నటి (Serail Actor) అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందని ఆమె భర్త ఆరోపించారు. పెళ్లయిన తర్వాత రూ. 25 లక్షలు కాజేసి ఇప్పుడు విడాకులు అడుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ రియల్టర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధిత అడ్డాల ఐశ్వర్య భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ వేడుకుంటున్నాడు.

కాపు మ్యాట్రిమోనీ డాట్ కమ్ ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 6న శ్యామ్ కుమార్, ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ పలు చానళ్లలో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్‌లో (Serail Actor) ఐశ్వర్య నటిస్తోంది. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అల వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో ఐశ్వర్య నటిస్తోంది.పెళ్లి అయిన నెల రోజుల తర్వాత అక్రమ సంబంధం బయటపడిందని ఆయన చెబుతున్నారు
Also read:

