ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన (Kalki 2) ‘కల్కి 2898 ఏడీ’ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే ఇప్పుడు (Kalki 2)ఈ సీక్వెల్‌పై షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన
‘కల్కి–2’లో దీపికా పదుకొణె భాగం కానందున అధికారికంగా ప్రకటించింది. “జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. కల్కి సీక్వెల్లో దీపిక ఉండదు. మొదటి భాగంలో ఆమెతో చేసిన ప్రయాణం ఎంతో మధురమైనది. కానీ రెండో భాగంలో ఆమె భాగస్వామ్యం లేకపోవడం విచారకరం. భవిష్యత్తులో ఆమె మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం” అని ట్విట్టర్ వేదికగా వైజయంతీ మూవీస్ తెలిపింది.
దీపికపై వరుస రూమర్స్
గత కొన్ని రోజులుగా దీపికా పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె మరో భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘కల్కి–2’ నుంచి ఆమె వైదొలగడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త హీరోయిన్ ఎవరంటే?
దీపికా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ పెద్ద ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నుండి టాప్ నేమ్స్ గాసిప్స్‌గా వినిపిస్తున్నాయి.
సీక్వెల్‌పై భారీ అంచనాలు
మొదటి భాగం విజువల్స్, కాన్సెప్ట్, స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, దీపికా లేకపోవడం కొంతమంది అభిమానులను నిరాశపరిచినా, మేకర్స్ “గ్రాండ్ టీమ్‌తో సీక్వెల్ వస్తుంది” అని హామీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
Also read: