విజయవాడ (NavaratriDay3) ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఒకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో (NavaratriDay3) మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం ధరించి కరుణాకటాక్షాలతో భక్తులపై అనుగ్రహం కురిపిస్తారు.
ఈ రోజు అమ్మవారు చేతిలో అక్షయపాత్రను, మరో చేతిలో గరిటెను ధరించి, సమస్త మానవాళికి అన్నప్రసాదాన్ని అనుగ్రహించే తల్లిగా అలంకరించబడతారు. ఈ రూపంలో అమ్మవారు ఆహార లక్ష్మి స్వరూపిణిగా, భక్తులలో భక్తి, కృతజ్ఞత, దాతృత్వాన్ని పెంపొందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అలంకార ప్రాముఖ్యం
అన్నపూర్ణా అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన గృహాలలో అన్నసమృద్ధి నెలకొంటుంది. కష్టకాలాల్లో ఎప్పుడూ ఆహారాభావం కలగకుండా చేస్తుందని విశ్వాసం. భక్తులు ఈ రోజున ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, తల్లిని కృతజ్ఞతతో ఆరాధిస్తారు.
కేవలం విజయవాడలోనే కాకుండా, వరంగల్ భద్రకాళి అమ్మవారు కూడా దసరా శరన్నవరాత్రుల మూడో రోజున అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించబడతారు. ఈ సమయంలో అమ్మవారి ఆలయాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
విజయవాడ కనకదుర్గమ్మ:
దసరా శరన్నవరాత్రులలో మూడో రోజు
-
అలంకారం: అక్షయపాత్ర, గరిటెతో అన్నపూర్ణా రూపం
ధరించి కరుణాకటాక్షాలతో భక్తులపై అనుగ్రహం కురిపిస్తారు.
ఈ రోజు అమ్మవారి భక్తి తన్మయ దర్శనం పొందిన వారు, జీవితాంతం అన్నపూర్ణ కృపకు పాత్రులవుతారని నమ్మకం.
Also read: