Keerthy Suresh: రౌడీ జనార్దన్‌లో కీర్తి సురేశ్ గ్లామర్

Keerthy Suresh

టాలీవుడ్‌లో **‘మహానటి’**గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న (Keerthy Suresh) కీర్తి సురేశ్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతోందనే టాక్ గాసిప్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఎక్కువగా పర్ఫార్మెన్స్‌ బేస్డ్ రోల్స్తో గుర్తింపు తెచ్చుకున్న (Keerthy Suresh) కీర్తి, ఇప్పుడు మాత్రం గ్లామర్ రోల్‌కి సై చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Keerthy Suresh wearing a sleeveless pink dress with red rose embroidery on the chest. Her long brown hair is loose, and she is smiling with her arms raised, holding her hair. She wears pearl earrings.

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి గ్లామర్ షిఫ్ట్

కీర్తి సురేశ్ బాలీవుడ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి తన కెరీర్‌లో మార్పులు తెచ్చుకుంటోందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘బేబిజాన్’ సినిమాలో కీర్తి గ్లామరస్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ట్రాక్‌ని కొనసాగిస్తూ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కొత్త ఇమేజ్‌ని సొంతం చేసుకోవాలని కీర్తి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Keerthy Suresh and a man in traditional white outfits with floral embroidery, sitting outside a house with a dark wooden door and yellow marigold garlands. Two small dogs wearing yellow outfits stand nearby. Keerthy Suresh adjusts marigold garlands on a tree in a sunny outdoor setting, wearing a white saree with floral designs.

రౌడీ జనార్దన్‌లో కీర్తి – విజయ్ జోడీ

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్దన్’. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. అతనికి జోడీగా కీర్తి సురేశ్ ఫైనల్ అయ్యిందన్న వార్తలు కోలీవుడ్, టాలీవుడ్ సర్కిళ్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో కీర్తి తన ఇంతవరకు చూపని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోందట.

Image

 లిప్ లాక్ సీన్ రూమర్స్

‘రౌడీ జనార్దన్’లో కీర్తి, విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఆఫర్ తొలుత రుక్మిణీ వసంత్‌కి వెళ్లిందని, కానీ గ్లామర్ రోల్, లిప్ లాక్ సీన్స్ విన్న వెంటనే ఆమె వెనక్కి తగ్గిందని ఇండస్ట్రీ టాక్. ఆ తరువాత ఈ ఛాన్స్ కీర్తి వద్దకు వెళ్లగా, ఆమె మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించిందన్న వార్తలు హాట్‌గా మారాయి.

Image

పెళ్లి తరువాత ఇమేజ్ షాక్

ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు ఇలాంటి గ్లామర్, లిప్ లాక్ సీన్స్‌కి ఓకే చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు తన ఇమేజ్‌ని క్లీన్‌గా మేనేజ్‌ చేసిన కీర్తి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొత్త ప్లానింగ్ ఉందా? లేక కెరీర్‌లో మరో మలుపు తిప్పుకోవాలనే ఉద్దేశ్యమా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

The image features two individuals, identified as Vijay Devarakonda and Keerthy Suresh, standing side by side. Vijay Devarakonda is dressed in a white shirt with rolled-up sleeves and dark trousers, while Keerthy Suresh is wearing a traditional light pink saree adorned with intricate embroidery. Both are smiling warmly, suggesting a friendly and positive atmosphere. The post text from Milagro Movies indicates that this is an exclusive image related to the project "RowdyJanardhan," hinting at a promotional or celebratory context. The background is neutral, focusing attention on the individuals, and the overall composition conveys a sense of camaraderie and professional collaboration.

గాసిప్ లేక నిజం?

‘రౌడీ జనార్దన్’ టీమ్ ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్పందించకపోవడంతో, ఈ వార్తలు నిజమా? లేక కేవలం పబ్లిసిటీ గిమ్మికా? అన్న సందేహం ఉంది. అయినప్పటికీ, కీర్తి సురేశ్ గ్లామర్ అవతారం, లిప్ లాక్ న్యూస్ టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

also read: