DonaldTrump: పాక్–ఆఫ్ఘాన్ యుద్ధం చిటికెలో ఆపేస్తా!

DonaldTrump

పాక్–ఆఫ్ఘాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ఘర్షణలను తాను చిటికెలో ఆపగలగనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DonaldTrump) అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి విందు సందర్భంగా మాట్లాడిన ట్రంప్, ఈ వ్యాఖ్యలు (DonaldTrump) చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ, “యుద్ధాలను ఆపడం చాలా తేలికైన పని. పాక్–ఆఫ్ఘాన్ ఘర్షణ కూడా నేను సులభంగా ఆపేస్తాను,” అని అన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం, యుద్ధాలను నిలిపివేయడం తనకు ఇష్టమైన పని అని, ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడడం తనకు ప్రధాన ధ్యేయం అని తెలిపారు.

తాను ఇప్పటికే లక్షలాది ప్రాణాలు కాపాడానని, ఎనిమిది యుద్ధాలను ఆపిన రికార్డు తనదేనని ట్రంప్ పేర్కొన్నారు.

అదే సమయంలో, భారత్–పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తతలను కూడా తానే శాంతింపజేశానని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తాను చేసిన ఈ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలు పాక్–ఆఫ్ఘాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ముగిసిన సమయంలో రావడం గమనార్హం. ఈ విరమణ పొడిగింపు కోసం ఇరుపక్షాలు దోహాలో సమావేశం కానున్నాయని సమాచారం.