సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ (Special trains)
దీపావళి పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైల్వే అధికారులు అదనపు (Special trains) ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వరకు పర్యాటకులు, భక్తులు, ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్పెషల్ ట్రైన్ వివరాలు:
-
ట్రైన్ నంబర్ 07081: సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో ఉదయం 10:30 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు అర్థరాత్రి 12 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుతుంది.
-
ట్రైన్ నంబర్ 07082: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో తెల్లవారు జామున 6:20 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ రైళ్లు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, బస్మత్, హింగోళి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, బీణా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్‌పూర్, ఆగ్రా కాంటోన్మెంట్, మథుర మీదుగా ప్రయాణిస్తాయి.
ఈ స్పెషల్ ట్రైన్లు పండగ సీజన్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల సౌలభ్యం కోసం అనుకూలంగా ఉండనున్నాయి.
మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, బస్మత్, హింగోళి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, బీణా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్‌పూర్, ఆగ్రా కాంటోన్మెంట్, మథుర మీదుగా ప్రయాణిస్తాయి.
Also read:
- JublieeHills: జూబ్లీహిల్స్ 211 మంది నామినేషన్లు
- Kerala: కుంగిన హెలికాప్టర్.. రాష్ట్రపతికి తప్పిన ముప్పు

