ఒక్క పాటకు రూ. 30 కోట్లు
భారతీయుడు.. 27 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా.. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ భారతీయుడు–2(Bharathiyudu-2)
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోందీ మూవీ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2024 ఏప్రిల్ లో ఇండియన్ 2, 2024 దీపావళిలో ఇండియన్ 3ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పాటు భారతీయుడు–2 (Bharathiyudu-2)సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి వస్తోంది.


దీంతో రెండు సినిమాల షూటింగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాలో ఓ పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. 30 కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్స్ పై కమల్ పాటను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని యూనిట్ తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read:
Aadhar Card : జూన్ 14 దాకా ఆధార్ ఫ్రీ అప్డేట్
T-Safe :టీ-సేఫ్ యాప్ స్టార్ట్

