Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం..10 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ భూకంపం మజార్-ఈ-షరీఫ్ సమీపంలోని ఖుల్మ్‌ ప్రాంతంలో (Earthquake) కేంద్రీకృతమై ఉంది.

Image

ఈ భూకంపం కారణంగా పలు ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో కనీసం 10 మంది మృతి చెందగా, 260 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Image

ఇక పలు లారీలు, వాహనాలు నాశనం కాగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం, భూకంప కేంద్రం భూమి నుంచి 28 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించారు.

భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శిథిలాల దృశ్యాలు, రక్షణ చర్యల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: