గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు GHMC మరొక ముఖ్యమైన డిజిటల్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై బర్త్ సర్టిఫికేట్‌లు, డెత్ సర్టిఫికేట్‌లు పొందేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవలం వాట్సాప్ ద్వారానే సంబంధిత వివరాలను పొందే విధానం ప్రారంభమైంది. ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, GHMC పరిధిలోని 30కి పైగా పర్కిళ్లలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
సాంకేతికత వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు, ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత సర్వీస్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపితే, వినియోగదారులు పిల్లల జనన సర్టిఫికేట్, మరణ సర్టిఫికేట్‌లకు సంబంధించిన రికార్డ్ వివరాలను వెంటనే పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రస్తుతం డెత్ సర్టిఫికేట్‌ల విషయంలో 2025 జూన్ 2 వరకు మరణించిన వ్యక్తుల వివరాలు మాత్రమే ఈ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టంచేశారు.
మీసేవ వాట్సాప్ సేవ ద్వారా సర్టిఫికెట్ల ప్రాసెస్ వేగవంతం అవుతుంది. ఇప్పటి వరకు ప్రజలు మీసేవలకు వెళ్లి లాంగ్ క్యూల్లో నిలబడటం, సర్వీస్ సెంటర్ సమయానికి వెళ్లడం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చేది. కానీ తాజా డిజిటల్ వ్యవస్థతో, ఇంట్లో నుంచే, 24 గంటలూ అవసరమైన వివరాలను పొందవచ్చు. ఈ సర్వీస్ వినియోగదారులకు పెద్దగా ఉపయుక్తం కానుంది.
ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఈ సేవను ఉపయోగించడం ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్ సర్వీస్ ద్వారా తమ సర్టిఫికేట్ దరఖాస్తులు ఎంతో సులభతరం అయ్యాయని పలువురు వినియోగదారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృద్ధులకు, ఉద్యోగస్తులకు, శారీరకంగా బయటకు వెళ్లలేని వారికి ఈ సౌకర్యం ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
GHMC డిజిటల్ సర్వీసులు పెంచే క్రమంలో, భవిష్యత్తులో మరిన్ని పౌరసేవలను కూడా వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త డిజిటల్ మార్పులతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి రావడం పెద్ద విశేషం.
Also read:

