Coimbatore: భార్యను నరికి హత్య – శవంతో భర్త సెల్ఫీ…

Coimbatore

తమిళనాడులోని (Coimbatore) కోయంబత్తూరులో అనుమానం ఎంత పెద్ద ప్రాణాంతక సమస్యగా మారుతుందో మరోసారి రుజువైంది. భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను నరికి చంపి… అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం పక్కనే కూర్చొని సెల్ఫీ దిగాడు. “ద్రోహానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే” అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన (Coimbatore) జిల్లావాసులను షాక్‌లోకి నెట్టింది.

ఏం జరిగింది?

తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్‌కు శ్రీప్రియతో వివాహమైంది. ముగ్గురు పిల్లలున్న ఈ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. తరచూ జరిగే గొడవలతో విసిగిపోయిన శ్రీప్రియ, భర్తను వదిలి కోయంబత్తూరులోని ఓ విమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తోంది.

ఇదే సమయంలో శ్రీప్రియకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం రోజురోజుకూ మానసిక రుగ్మతలా అతన్ని వెంటాడుతూ వచ్చింది.

హాస్టల్‌కు వెళ్లి దాడి

అనుమానం అతి దారుణానికి దారితీసింది. బాలమురుగన్ హాస్టల్‌కు వెళ్లి, తనతో రావాలని భార్యను కోరాడు. ఆమె నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఉన్మత్తుడైన బాలమురుగన్ తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెను క్రూరంగా నరికి చంపాడు.

సెల్ఫీ తీసి పోస్ట్

ఇంత దారుణం చేసిన తర్వాత కూడా అతనికి పశ్చాత్తాపం లేదు. భార్య శవం పక్కనే కూర్చొని సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ద్రోహానికి ఇదే మూల్యం” అంటూ రాసిన క్యాప్షన్‌ అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసులు అరెస్ట్

హాస్టల్‌లోని మహిళలు అరుపులు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునే వరకు బాలమురుగన్ సంఘటనా స్థలంలోనే కూర్చొని ఉన్నాడు. అనంతరం అటువెంటనే అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానం ప్రాణాలు తీస్తుంది

తెలంగాణలోని వికారాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగిన విషయం గుర్తుచేస్తూ, పోలీసులు “అనుమానం అనేది మానసిక వ్యాధి… చికిత్స చేయకపోతే ఇలాంటి ప్రాణనష్టాలు తప్పవు” అని హెచ్చరిస్తున్నారు.

Also read: