జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ (Kondagattu) కొండగట్టు ప్రాంతంలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాదం స్థానికులను తీవ్రంగా భయాందోళనలకు గురిచేసింది.ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు వరుస (Kondagattu) దుకాణాలను ఆవరించాయి.కొద్ది నిమిషాల్లోనే మంటలు నియంత్రణలోకి రాకుండా వేగంగా వ్యాపించాయి.
ఈ ఘటనలో మొత్తం 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఏ దుకాణం కూడా మంటల నుండి తప్పించుకోలేదు.
వాటిలో చాలావాట్లు చిన్న వ్యాపారుల జీవనాధారాలు.ఏళ్ల తరబడి కష్టపడి నడిపిన దుకాణాలు క్షణాల్లో బూడిదయ్యాయి.
దాదాపు 20 ఏళ్లుగా వ్యాపారం చేయుతున్న పేద దుకాణదారులు కన్నీటితో తమ దుస్థితిని వివరించారు.తమ సర్వస్వం మంటల్లో కాలిపోయిందని వేదన వ్యక్తం చేశారు.బంగారం, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సర్టిఫికెట్లు, పత్రాలు అన్నీ కాలి బూడిద అయ్యాయి.వీటిని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం అని బాధితులు చెబుతున్నారు.దుకాణాల్లో ఉంచిన నగదు కూడా మంటల్లో నాశనం అయ్యింది.
అగ్నిప్రమాదం జరిగిన సమయానికి చాలా మంది నిద్రలో ఉండటంతో ఆలస్యంగా విషయం తెలిసింది.స్థానికులు ఏకగ్రీవంగా కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.తరువాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అణచేందుకు భారీగా కృషి చేశారు.కానీ అప్పటికే మంటలు దుకాణాలను పూర్తిగా కాయం చేశాయి.
ఈఅగ్నిప్రమాదంతోపలువురుకుటుంబాలువీధినపడ్డాయి.రోజువారిజీవనాధారంకోల్పోయికన్నీరుమున్నీరవుతున్నారు.తమకు వచ్చిన నష్టాన్ని మాటల్లో చెప్పలేమని బాధితులు అన్నారు.ఇక మళ్లీ ఎలా ప్రారంభించాలో తెలియక ఆందోళనలో ఉన్నారు.పలువురు వ్యాపారులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.తక్షణ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.
ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ జీవనం సాగించే పేద కుటుంబాలే ఎక్కువ.అందుకే ఈ అగ్నిప్రమాదం ప్రభావం మరింత తీవ్రమైంది.పెద్దగా పొదుపులు లేని ప్రజలు తమ వ్యాపారం మీదే ఆధారపడేవారు.
ఇప్పుడు ఆ జీవనాధారం పూర్తిగా నాశనం అయ్యింది.
అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.నష్టం వివరాలను సేకరించారు.ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధానంపై చర్చలు జరుగుతున్నాయి.బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొండగట్టు వంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి అగ్నిప్రమాదం జరగడం అందరిని కలచివేసింది.ప్రజలు,వ్యాపారులు ప్రభుత్వం నుంచి తక్షణ పునరావాసం మరియు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Also read:

