రష్మిక మందన్న (Thama Movie) ప్రధాన పాత్రలో నటించిన హరర్ చిత్రం ‘థామా’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందన వచ్చినప్పటికీ, (Thama Movie) రష్మిక పోషించిన కొత్త తరహా వ్యాంపైర్ పాత్ర మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో మరోసారి హల్చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ హారర్ మూవీ తొలి రోజు నుంచే కథలోని నవ్యతతో అందరిలో ఆసక్తి రేపింది. ముఖ్యంగా రష్మిక పోషించిన రక్తం తాగే అతీత శక్తులున్న యువతి ‘తడ్కా’ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.
కథ విషయానికి వస్తే—అలోక్ గోయల్ అనే పత్రికాధికారి పాత్రలో ఆయుష్మాన్ నటించాడు. తన స్నేహితులతో కలిసి వార్తా కవరేజీ కోసం కొండ ప్రాంతానికి వెళ్లిన అలోక్‌పై ఊహించని రీతిలో ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆ ప్రమాదకర సమయంలో అతడిని రక్షించేది తడ్కానే. తడ్కా బేతాళ జాతికి చెందిన, మనుషుల రక్తాన్ని తాగే శక్తులు కలిగిన యువతి. ఆమె జీవితంలో అలోక్ ప్రవేశించడం వల్ల కథ ఏ దిశగా మలుపు తిరుగుతుంది? ఆ ఇద్దరి మధ్య ఏర్పడే అనుబంధం, బేతాళ వంశ రహస్యాలు, నవాజుద్దీన్ పోషించిన పాత్రతో వచ్చే మలుపులు—సినిమాను మొత్తం సస్పెన్స్‌తో నింపుతాయి.
థియేటర్లలో సాధారణ స్థాయి వ్యాపారం చేసినప్పటికీ, నటీనటుల ప్రదర్శనకు సమీక్షల్లో మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా రష్మిక నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ విధానంలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో మాత్రం అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
Also read:

