Obscene: పలు వెబ్‌సైట్స్, యాప్స్ కూడా తొలగింపు

Obscene

ఢిల్లీ : అశ్లీల (Obscene) కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా అకౌంట్ లను కేంద్రం తొలగించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ చర్యలు చేపట్టింది. తొలగించిన యాప్‌ లలో ఏడు గూగుల్‌ ప్లేస్టోర్‌లోవి కాగా.. మూడు యాపిల్‌ యాప్‌స్టోర్‌లోనివని కేంద్రం తెలిపింది. (Obscene) సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్లు వెల్లడించింది. తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నట్లు పేర్కొంది.

Also read: