డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. (Prabhas) ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.హారర్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది.
సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘ది రాజాసాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు.“సహనా సహనా నా సఖి సహనా… కలలో నిన్నే చూశానా” అంటూ సాగే ఈ పాటను నిన్న లాంచ్ చేశారు.ఈ పాట విడుదల కార్యక్రమానికి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు.
ఈ పాటకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది.మెలోడీ, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే పాట లాంచ్ కార్యక్రమం అనంతరం అనుకోని ఘటన చోటు చేసుకుంది.నిధి అగర్వాల్ అభిమానుల హంగామాతో అసౌకర్యానికి గురయ్యారు.పాట విడుదల పూర్తైన తర్వాత ఆమె తన కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలో వందల మంది అభిమానులు ఆమె చుట్టూ చేరారు.కొంతమంది అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.మరికొందరు ఆమెను తాకేందుకు కూడా ప్రయత్నించారు.దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.నిధి అగర్వాల్ ఇబ్బందిగా కనిపించారు.
ఈ పరిస్థితిని గమనించిన ఆమె బాడీగార్డులు వెంటనే స్పందించారు.అభిమానులను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.చాలా కష్టపడి నిధిని సురక్షితంగా కారు వద్దకు తీసుకెళ్లారు.ఆమెను క్షేమంగా కారులో కూర్చోబెట్టారు.ఈ ఘటన తర్వాత నిధి అగర్వాల్ ఊరిపి పీల్చుకున్నట్టు సమాచారం.ఈ మొత్తం ఘటనను కొందరు వీడియోగా చిత్రీకరించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఫ్యాన్ క్రేజ్ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతను విస్మరించడం తప్పని వ్యాఖ్యానిస్తున్నారు.ముఖ్యంగా మహిళా నటుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అంటున్నారు.ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు.అభిమానులు హద్దులు దాటకూడదని హెచ్చరిస్తున్నారు.
సెల్ఫీల కోసం ఇలాంటి ప్రవర్తన తగదని స్పష్టం చేస్తున్నారు.
ప్రభాస్ సినిమా కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాల ఈవెంట్లలో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.‘ది రాజాసాబ్’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.కానీ ఇలాంటి ఘటనలు చిత్రబృందానికి ఇబ్బందిగా మారుతున్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లలో నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also read:

