టాలీవుడ్‌లో మరో కొత్త హీరోయిన్‌పై (Ram Charan) హైప్ మొదలైంది.ఆమె ఎవరో కాదు.‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్.రోషన్ మేక హీరోగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.పీరియాడ్ టచ్‌తో కూడిన కథ.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్.భావోద్వేగాలు కలగలిసిన ప్రెజెంటేషన్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.
డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన హాజరు ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.స్టేజ్‌పై మాట్లాడిన చరణ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముందుగా హీరో రోషన్ మేకను ప్రశంసించారు.ఈ సినిమాలో అతడి నటనలో మెచ్యూరిటీ కనిపిస్తోందని అన్నారు.
నిర్మాత అశ్వినీదత్‌పై కూడా ప్రశంసలు కురిపించారు.కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారని చెప్పారు.అయితే అసలు హైలైట్ మాత్రం హీరోయిన్ అనస్వర రాజన్ గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలే.
ఆమెను చూస్తూ “మీ ఫేస్ చాలా కళగా ఉంది” అంటూ ప్రశంసించారు.తెలుగు ఇండస్ట్రీలో మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
“చాలామంది దర్శక నిర్మాతలు మీ డేట్స్ కోసం పోటీ పడే రోజు తప్పకుండా వస్తుంది” అంటూ అనస్వరను ప్రోత్సహించారు.ఈ మాటలు అక్కడున్న అభిమానులను ఆకట్టుకున్నాయి.అనస్వర ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది.
మలయాళం అయినప్పటికీ తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పడం నిజంగా అభినందనీయమని రామ్ చరణ్ అన్నారు.ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు డబ్బింగ్ చెప్పడానికి ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.
అలాంటి పరిస్థితుల్లో అనస్వర చేసిన ప్రయత్నం ఆమె డెడికేషన్‌ను చూపిస్తుందని అన్నారు.ఈ డెడికేషన్‌నే ఆమెకు మంచి భవిష్యత్తును తీసుకువస్తుందని చరణ్ స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అనస్వర రాజన్ కూడా అదే వేదికపై స్పందించారు.రామ్ చరణ్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.
ముఖ్యంగా ‘మగధీర’ సినిమా తనకు ఫేవరెట్ అని అన్నారు.ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని చెప్పడంతో అభిమానులు చప్పట్లు కొట్టారు.మలయాళ చిత్రాలతో అనస్వర ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది.2017లో ‘ఉదాహరణం సుజాత’ సినిమాతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది.తొలి సినిమాతోనే సహజమైన నటనతో గుర్తింపు పొందింది.
2023లో విడుదలైన ‘నేరు’ సినిమాలో ఆమె చేసిన పాత్ర కీలక మలుపుగా నిలిచింది.చూపు లేని యువతిగా, లైంగిక దాడికి గురైన బాధితురాలిగా ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఆ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగంగా కదిలించింది.
ఈ ఏడాది విడుదలైన ‘రేఖాచిత్రం’ కూడా అనస్వర కెరీర్‌లో మరో మెట్టు.బలమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందింది.ఇప్పుడు ‘ఛాంపియన్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనస్వరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తోడు రామ్ చరణ్ లాంటి స్టార్ చేసిన ప్రశంసలు ఆమెకు పెద్ద బూస్టింగ్ ఇచ్చాయనే చెప్పాలి.
Also read:
- China: ఈశాన్య భారతానికి ‘టైమ్ బాంబ్’ ముప్పు
- Prabhas: ‘ది రాజాసాబ్’ పాట లాంచ్‌లో నిధి అగర్వాల్‌కు అసౌకర్యం

