Delhi: గాలి కాలుష్యం… విమాన రాకపోకలకు అంతరాయం

Delhi

దేశ రాజధాని (Delhi) ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈరోజు (Delhi) ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 380కి పడిపోయింది.ఇది అత్యంత ప్రమాదకర స్థాయిగా నిపుణులు చెబుతున్నారు.ఢిల్లీలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.కళ్లలో మంటలు.గొంతు మంట.శ్వాసలో ఇబ్బంది.ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి.

Image

ఢిల్లీ నగరంలో ఉన్న 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.ఈ స్టేషన్లలో ఏకంగా 14 కేంద్రాల్లో ఏక్యూఐ లెవెల్స్ 400 కంటే ఎక్కువగా నమోదయ్యాయి.ఇది ‘సీవియర్’ కేటగిరీ కిందకు వస్తుంది.ఈ స్థాయిలో బయట తిరగడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Image

ఒకవైపు కాలుష్యం పెరుగుతుండగా మరోవైపు దట్టమైన పొగ మంచు పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది.
ఉత్తర భారతదేశం మొత్తం లో విజిబులిటీ సమస్య ఎదురవుతోంది.దీని ప్రభావం విమాన రాకపోకలపై పడింది.లో విజిబులిటీ కారణంగా 100కు పైగా విమానాలు రద్దయ్యాయి.మరికొన్ని విమానాలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.విమానాల రద్దుతో పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి.ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు అలర్ట్ ప్రకటించాయి.ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి.వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని కోరాయి.

లో విజిబులిటీ పరిస్థితుల్లో విమానాలను ల్యాండ్ చేయడం ప్రమాదకరంగా మారింది.ఈ నేపథ్యంలో అధికారులు కేటగిరీ-3 హెచ్చరికను జారీ చేశారు.ఈ హెచ్చరిక అమలులో ఉన్నప్పుడు ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లు మాత్రమే ల్యాండింగ్ చేయగలుగుతారు.అన్ని విమానాలు ఈ ప్రమాణాలకు సరిపోవని అధికారులు తెలిపారు.

కాలుష్యం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.చలికాలంలో వాతావరణ మార్పులు.
పంట మిగులు దహనం.వాహనాల పొగ.నిర్మాణ కార్యకలాపాలు.ఈ అన్ని అంశాలు కలిసి గాలి నాణ్యతను మరింత దెబ్బతీస్తున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది.అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
మాస్క్‌లు ధరించాలని.ఇళ్లలోనే ఉండాలని.గాలి కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు గమనించాలని హెచ్చరిస్తున్నారు.

Image

ఢిల్లీలో గాలి కాలుష్యం ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారుతోంది.
రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Also read: