Railway: సంక్రాంతి రద్దీకి సౌత్ సెంట్రల్ రైల్వే భారీ ఏర్పాట్లు

Railway

సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే (Railway) భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జంటనగరాల నుంచి వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక (Railway)  రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే124 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.

Image

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ చర్లపల్లి లింగంపల్లి కాచిగూడ నాంపల్లి స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు పలుచోట్లకు వెళ్లుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ మొత్తం మీద  సుమారు600కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి
అవసరమైతే మరిన్ని రైళ్లను కూడా పెంచుతామని స్పష్టం చేశారు.

Image

సంక్రాంతి పండగకు ఇంకా 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు బుకింగ్‌లువేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన చాలా ప్రత్యేక రైళ్లలో  రిజర్వేషన్లు త్వరగా నిండిపోతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

Image

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కాకినాడ విజయవాడ శ్రీకాకుళం గుంటూరు రాజమండ్రి తిరుపతి
మార్గాల్లో భారీగా డిమాండ్ ఉందన్నారు. ఈ మార్గాల్లో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉంటారని చెప్పారు. ఈ రద్దీని ముందుగానే అంచనా వేసి జనవరి 24 వరకు 400కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేలా
ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

Image

ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందనిరైల్వే అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోలిస్తే సంక్రాంతి సమయంలోప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరుగుతుందని తెలిపారు.

అందుకే స్టేషన్లలో భద్రత పరిశుభ్రత సిబ్బంది సంఖ్యటికెట్ కౌంటర్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టంగా తెలిపింది.

టికెట్లు బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు ఈ విషయం గమనించాలని సూచించింది. చివाఁడి నిమిషంలో
రద్దీ పెరగకుండా ఉండేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది.సంక్రాంతి పండుగను సురక్షితంగా సౌకర్యంగా స్వగ్రామాల్లో జరుపుకునేలా రైల్వే అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు పెద్ద ఊరటగా మారనున్నాయని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also read: