మాఘ మాసంలో వచ్చే అమావాస్యను(Mauni Amavasya) మౌని అమావాస్య అంటారు. హిందూ ధర్మంలో ఈ రోజుకు గొప్ప ప్రాధాన్యత ఉంది. స్నానం, దానం, అలాగే పితృదేవతలకు తర్పణం అర్పించడానికి ఇది అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణిస్తారు. మౌని అమావాస్య (Mauni Amavasya) నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. ఇది వ్యక్తి జీవితంలో సుఖ-సమృద్ధిని ప్రసాదిస్తుందని ప్రతీతి. శాస్త్రాల్లో మౌని అమావాస్యకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి.
ఈసారి మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అంటారు. అమావాస్య స్నానం చేసేటప్పుడు, తలపై తెల్ల జిల్లేడు ఆకును ఉంచుకుని శివనామస్మ రణ చేయాలి. ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా ముఖ్యం. అది సాధ్యం కాకపోతే, అన్నపానీయాలు తీసుకోకుండా, పేదలకు మినప పప్పు, బియ్యం దానం చేయాలి.
అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం చేసిన రోజు కావడం వల్ల సాయంత్రం వేళ దక్షిణ దిశలో ఆవనూనె దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఈ రోజున ప్రధాన ద్వారం వద్ద కూడా దీపాన్ని వెలిగించాలి. మౌని అమావాస్య రోజున ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం, నీరు అందించాలని నమ్మకం. దీనివల్ల పితృదేవతల ఆశీర్వాదాలు లభించి, జీవితంలో సుఖ-సమృద్ధిలు వెల్లివిరుస్తాయి. అమావాస్య తిథి నాడు రావి చెట్టుకు తప్పకుండా నీటిని సమర్పించాలి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించాలి.
మౌని అమావాస్య రోజున సత్యనారాయణ వ్రతం చేయించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పుణ్యతిథి నాడు ప్రయాగ్ రాజ్, హరిద్వార్‌లలో స్నానం చేయడానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానం చేయడం ద్వారా మోక్షం లభించి, అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం వస్తుందని ప్రతీతి. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, దాన-ధర్మాలు తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు శాంతి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.
Also Read :
- GreenLand: గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను.ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు
- Medaram: మేడారం మహాజాతర వేళ కొత్త బిజినెస్‌లు

